
పట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బిహార్‌కు ఏం చేశారని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉందని, దీనికి ఎవరు కారణమని నిలదీశారు. ఈ సందర్భంగా 15 ప్రశ్నలు అడిగారు. ‘‘బిహార్ రాష్ట్రం అన్ని రంగాల్లో చివరి స్థానంలో ఉంది. అక్షరాస్యత, తలసరి పెట్టుబడి, నిరుద్యోగం, నిర్మాణ రంగం, పారిశ్రామిక అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదు.
రైతుల ఆదాయం పెరగలేదు. వలసలు, పేదరికం పెరిగాయి. స్పెషల్ స్టేటస్ కింద నిధులు ఇవ్వలేదు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అని చెప్పి ప్రజలను మోసం చేశారు. బిహార్‌కు టెక్ట్స్‌టైల్ పార్క్ ఎందుకు ఇవ్వలేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని మోదీ హామీ ఇచ్చి, ఇంతవరకు ఏమీ చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత ప్రభుత్వంలో 65% రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయట్లేదు” అని తేజస్వీ ప్రశ్నించారు.