కనుమరుగు కానున్న ఆదర్శగని 

నస్పూర్, వెలుగు:  శ్రీరాంపూర్ ఏరియాలోనే ప్రత్యేకంగా నిలిచిన  ఆర్కే 6  గని 2025 ఆగస్టు వరకు మాత్రమే నడుస్తుందని గని మేనేజర్ తిరుపతి తెలిపారు.  మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ..  1975లో  ప్రారంభమైన గని  జూన్ 10న ప్రారంభమైందన్నారు.  50 సంవత్సరాల వేడుకలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గనిలో మొత్తం 29.80 మిలియన్  టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా ప్రస్తుతానికి 14.78 మిలియన్  టన్నులు తీశారన్నారు.  

ఇంకా 13.95 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు.   గనిలో జి-9, జి-12 గ్రేడ్ బొగ్గు ఉందన్నారు.  మూడు సంవత్సరాలుగా వందశాతం  పైగా ఉత్పత్తితో  సింగరేణిలోనే  ఉత్తమ గనిగా పేరు పొందిందన్నారు.  ఉత్పత్తితో పాటు 2024 సంత్సరంలో ప్రమాదరహిత గనిగా నిలవడం గొప్ప విషయమన్నారు.