
- శ్రీలంకలోని మరియమ్మ కార్తియన్ ఆలయ పునరుద్ధరణ
- త్వరలోనే గోశాల, గురుకులం ప్రారంభం
- ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.కె.జైన్, అడ్వైజర్ జస్మత్ పటేల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.కె.జైన్, అడ్వైజర్ జస్మత్ పటేల్ తెలిపారు. శ్రీలంకలోని మరియమ్మ కార్తియన్ ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ హోమయాగం, ఇతర క్రతువులతో ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించారు. ఆర్ కే జైన్, జస్మత్ పటేల్ తోపాటు సభ్యులు నరసింహరావు, డాక్టర్ హరికుమార్, రజని, డాక్టర్ పి.రమాదేవి, సతీశ్నటరాజన్ పాల్గొన్నారు. ఆర్.కె.జైన్, జస్మత్ పటేల్ మాట్లాడుతూ శ్రీలంకలో కూడా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
త్వరలో అక్కడ గోశాల, గురుకులాన్ని ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ అధ్యక్షుడు ముఖేశ్ చౌహాన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని నవాబ్ పేట, రేగోడ్ లోని జైన దేవాలయాలు, మొయినాబాద్‌లోని శ్రీబాలాజీ ఆలయానికి తూర్పున ఉన్న జైన దేవాలయాలను ట్రస్ట్ సహకారంతో పునరుద్ధరించినట్టు చెప్పారు. వీటితోపాటు మరో నాలుగు ఆలయాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సహకారంతో ఆలయాల లిస్టు రెడీ చేస్తున్నామని, వాటి పునరుద్ధరణ కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు అగర్వాల్ సమాజ్ అత్తాపూర్ శాఖ మంత్రి రిద్దీష్ జాగీర్ధార్ పేర్కొన్నారు.