AP News: బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ

AP News:  బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ

ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి రోజా అన్నారు.  బాబు షూరిటీ ..ఛీటింగ్​ గ్యారంటీగా మారిందన్న రోజా...  ఎన్నికల సమయంలో సూపర్​ సిక్స్​  పథకాలు అమలు కాకపోతే కాలర్​ పట్టుకోండి లోకేష్​ అన్నారని.. ఇప్పుడు ఎవరి కాలర్​ పట్టుకోవాలో చెప్పాలని మాజీ మంత్రి రోజా సూటిగా ప్రశ్నించారు. 

ఎన్నికల హామీలు తన బాధ్యత అన్న పవన్​ కళ్యాణ్​  .. చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడంలేదని అన్నారు. తాట తీస్తానన్న పవన్‌కళ్యాణ్‌ మాటలకే పరిమితమైందని.. మా పార్టీ మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా?  అని రోజా ప్రశ్నించారు . విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోవడంతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. ఫీజులు, స్కాలర్‌షిప్‌ కింద ప్రభుత్వం రూ.3 వేల 900 కోట్లు బకాయి పడిందన్నారు.  చెప్పారు. ఈనెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. 

బటన్‌ నొక్కడం పెద్ద విషయమా.. మూలనున్న ముసలమ్మ కూడా బటన్‌ నొక్కుతుందని అవహేళనగా మాట్లాడిన చంద్రబాబు, అంత తేలికైన విషయమైతే ఇప్పుడెందుకు నొక్కలేకపోతున్నారు? హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి వెంటనే పదవులకు రాజీనామా చేసి దిగిపోవాలని డిమాండ్​ చేశారు.  

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం (అమ్మ ఒడి), నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలు.. ఎప్పుడు, ఎవరు అమలు చేస్తారో.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చెప్పాలి. హామీల అమలుపై చంద్రబాబుని ప్రశ్నించడానికి పవన్‌కళ్యాణ్‌కు ఏం అడ్డం వచ్చిందో చెప్పాలన్నారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక వైయస్సార్‌సీపీ సానుభూతి మహిళలపై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టి వేధిస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తల ఆగడాలపై పవన్‌కళ్యాణ్‌ చర్యలు తీసుకోరా? మీ కూటమి పార్టీలో ఉన్నవారే మహిళలా? ఇతర మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా? మహిళల జోలికొస్తే తాట తీస్తామన్న మీ అట్టహాస డైలాగ్‌లు కేవలం మైక్‌లకే పరిమితమా? వైయస్సార్‌సీపీ మహిళల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్‌కె రోజా హెచ్చరించారు.