రోజా భర్త సెల్వమణికి అరెస్టు వారెంట్..ఆ ఇంటర్వ్యూ వల్లే..

రోజా భర్త సెల్వమణికి అరెస్టు వారెంట్..ఆ ఇంటర్వ్యూ వల్లే..

సినీ నటి,  ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా భర్త సెల్వమణికి అరెస్టు వారెంట్ జారీ అయింది.  సెల్వమణికి పరువు నష్టం దావా కేసులో  చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. 

2016లో దర్శకుడు ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఒక టీవీ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పరువు భంగం కలిగేలా  సెల్వమణి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా జార్జిటౌన్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణకు సెల్వమణి, ఆయన తరపు న్యాయవాది గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు సెల్వ మణికి ఆరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఇది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. సెల్వమణి ఈ అరెస్టు వారెంట్ నుంచి తప్పించుకోవాలంటే... కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన కోర్టుకు వస్తారా లేక.. తన లాయర్ ద్వారా సంప్రదింపులు జరుపుతారా తెలియాల్సి ఉంది.