నేషనల్​ స్టార్​ రేటింగ్​లో  ఆర్కే1ఏ బొగ్గు గని  ఓవరాల్​ ఫస్ట్

  •     కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సింగరేణి జీఎం

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని ఆర్కే-1ఏ సింగరేణి  బొగ్గు దేశవ్యాప్త బొగ్గు గనుల్లో ఫైవ్​ స్టార్  రేటింగ్​ పొంది  ఓవరాల్​ ఫస్ట్​ ప్లేస్  అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్   జోషి చేతుల మీదుగా మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​ ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా (కోలిండియా) 504 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి

రక్షణ, కార్మికుల సంక్షేమం, పర్యావరణం, వాటర్​ మేనేజ్​మెంట్, పునరావాసం, కార్మికులకు అవగాహన తదితర అంశాలపై ఉత్తమ గనుల ఎంపికలో 2019–-20 సంవత్సరానికి ఆర్కే1ఏ బొగ్గు గని  ఓవరాల్​ బెస్ట్​ ఫైవ్​ స్టార్​ రేటింగ్​ మైన్​గా , 2020–-21లో  మూడో బెస్ట్ ​ మైన్​గా ఎంపికయ్యింది. రెండేళ్లకు సంబంధించి బెస్ట్​ అవార్డులు దక్కించుకోవడంపై జీఎం, బెల్లంపల్లి రీజియన్​ సేఫ్టీ గుప్తా

గని యాక్టింగ్​ మేనేజర్​ జయంత్​కుమార్, ఏరియా పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్.. గని​ కార్మికులు, ఆఫీసర్లకు అభినందనలు తెలిపారు. అందరి సమష్టి కృషితో దేశంలోనే ఆర్కే1ఏ బెస్ట్​ మైన్​గా గుర్తింపు దక్కిందని వారు పేర్కొన్నారు.