విదేశీ విద్య స్కీమ్​ను ప్రభుత్వం నీరుగారుస్తోంది

విదేశీ విద్య స్కీమ్​ను ప్రభుత్వం నీరుగారుస్తోంది
  • ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపణ

మెహిదీపట్నం, వెలుగు: కొందరు ఉన్నతాధికారులు ఫీజు రీయింబర్స్​మెంట్​స్కీమ్​ను ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ నేతలు, స్టూడెంట్లు మాసబ్ ట్యాంకులోని తెలుగు సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. 

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విదేశీ విద్య స్కీమ్​ను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్​చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు స్టూడెంట్లు ఉన్నత విద్యకు దూరమవుతుంటే.. ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ నేతలు నీల వెంకటేష్, గుజ్జ సత్యం, పగిళ్ల సతీశ్ పాల్గొన్నారు.