అరుణాచల గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సులు

అరుణాచల గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సులు

ఖమ్మం టౌన్, వెలుగు: గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 21న అరుణాచల గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం, భద్రాచలం నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. ఈ మేరకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు.

బస్సులు ఈ నెల 19న ఆయా డిపోల నుంచి బయల్దేరి మరుసటి రోజు అరుణాచలం చేరుకుంటాయన్నారు. 21న తిరుగు ప్రయాణమై 22న ఖమ్మంకు వస్తాయన్నారు. ఖమ్మం నుంచి పెద్దలకు రూ.4190, భద్రాచలం నుంచి రూ.4 వేలుగా టికెట్ ధరలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు.