మేడారం జాతరకు 750 స్పెషల్​ బస్సులు  : ఆర్ఎం సుచరిత

మేడారం జాతరకు 750 స్పెషల్​ బస్సులు  : ఆర్ఎం సుచరిత

కరీంనగర్ టౌన్,వెలుగు: మేడారం జాతరకు కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ నుంచి 750 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం సుచరిత తెలిపారు. ఆదివారం కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ బస్టాండ్ ‌‌‌‌‌‌‌‌లో మేడారం జాతర క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ‌‌‌‌‌‌‌‌లో జాతర క్యాంపును ఈనెల 18నుంచి 25వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతరకు  వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం  చేసుకోవాలన్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా మరో 100 సర్వీసులను ఏర్పాటు చేస్తామన్నారు.  భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ ‌‌‌‌‌‌‌‌లో చలువ పందిళ్లు, నీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అనంతరం జెండా ఊపి మేడారం సర్వీస్ ‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాలోని డిపో మేనేజర్లు మల్లేశం, మల్లయ్య, మల్హర్ రావు, పాల్గొన్నారు.