కరీంనగర్ టౌన్,వెలుగు: టీఎస్ ఆర్టీసి పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం అమలు లోకి తీసుకొచ్చిన టీ9 సేవలు ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అమలులో ఉంటాయని ఆర్ఎం సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో ఉదయం 9గంటల నుంచి రాత్రి 6గంటల వరకే ఉండేదని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.