ఈ మధ్య ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలవుతున్నాయి. వచ్చిరానీ వైద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఏప్రిల్ 29న వర్దన్న పేటలో జ్వరం వచ్చిన ఓ వ్యక్తికి ఆర్ఎంపీ డాక్టర్ గంట వ్యవధిలోనే 7 ఇంజిక్షన్లు ఇవ్వడంతో రెండు రోజుల్లోనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా సున్తీ కోసం వచ్చిన ఓ బాలుడి పురుషాంగాన్ని కోసేశాడు ఆర్ఎంపీ .దీంతో బాలుడి పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది
ఖమ్మం నగరంలోని ఆర్డీవో కార్యాలయానికి దగ్గర్లో హమీద్ క్లినిక్ ఉంది. ఈ క్లినిక్‌కి సున్తీ కోసం ఓ వ్యక్తి తన కొడుకుని తీసుకువచ్చాడు. అయితే సున్తీ చేయబోతూ పురుషాంగం కోసేశాడు ఆర్ఎంపీ. దీంతో మర్మాంగం తెగిపోవడంతో విపరీతమైన రక్తస్రావమై బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కి తరలించారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.