మైనర్కు సిజేరియన్ డెలివరీ చేసిన ఆర్ఎంపీ డాక్టర్..శిశువు మృతి

మైనర్కు సిజేరియన్ డెలివరీ చేసిన ఆర్ఎంపీ డాక్టర్..శిశువు మృతి

ఆదిలాబాద్  జిల్లాలో దారుణం‌ జరిగింది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ మైనర్ బాలికకు సిజేరియన్  డెలివరీ చేయడంతో  శిశువు చనిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వారం రోజుల క్రితం   గిరిజా   గ్రామం వాగు సమీపంలో శిశువు మృతదేహం లభ్యం అయ్యింది. శిశువు ‌మృతదేహం‌పై   విచారణ చేపట్టారు పోలీసులు.   విచారణలో ఆర్ ఎంపీ డాక్టర్ చేసిన సిజేరియన్ అపరేషన్   విషయం బయటపడింది.   మైనర్ బాలికకు పుట్టిన శిశువు   వాగు సమీపంలో పడేసినట్లు ఆర్ఎంపీ డాక్టర్ ఒప్పుకున్నాడు. దీంతో  ఆర్ఎంపి  డాక్టర్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్లు చేసిన ఇంతకుముందు ఏమైనా సీజేరియన్ ఆపరేషన్లు  చేశారనేదానిపై ఆరాదీస్తున్నారు.

ALSO READ | మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి :  కలెక్టర్​ దివాకర