హుస్నాబాద్​లో సీఎం, మంత్రుల ఫొటోలకు ఆర్ఎంపీల క్షీరాభిషేకం

హుస్నాబాద్​లో సీఎం, మంత్రుల ఫొటోలకు ఆర్ఎంపీల క్షీరాభిషేకం

హుస్నాబాద్, వెలుగు : తమకు సీఎం రేవంత్​రెడ్డి గౌరవవేతనం ఇస్తామనడంపై ఆర్ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో తమను ఓటుబ్యాంకుగా వాడుకొని వదిలేసిందని, కాంగ్రెస్​ ప్రభుత్వం తమ బాగోగులను పట్టించుకోవడం సంతోషకరమన్నారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి తర్వాత ఇన్నేండ్లకు తమను ఆదుకునేవారు రావడం శుభపరిణామమని బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.

అంబేద్కర్​ చౌరస్తాలో సీఎం రేవంత్​రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తమకు ట్రైనింగ్​ ఇప్పించారన్నారు. ప్రభుత్వం నుంచి గౌరవవేతనాలు ఇచ్చి తమను వైద్యసేవల్లో భాగంచేద్దామనుకునే ప్రక్రియ ఆయన మరణంతో ఆగిపోయిందన్నారు.

కార్యక్రమంలో ఆర్ఎంపీల సంఘం హుస్నాబాద్​ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు సుదర్శన్, ఆర్ఎంపీలు బంక చందు, ముంతాజ్, శ్రీను, బాలయ్య, ఆంజనేయులు, ప్రకాశ్, కృష్ణ, పరశురాములు పాల్గొన్నారు.