హైదరాబాద్: అగ్ని మిస్సైల్ రూపకర్త, డీఆర్డీవో శాస్త్రవేత్త, పద్మభూషణ్అవార్డ్ గ్రహీత రామ్నారాయణ్అగర్వాల్(84) అంత్యక్రియలను శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రామ్ నారాయణ్అగర్వాల్ వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య కారణాలతో గురువారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
అబ్దుల్ కలాంతో కలిసి కీలక సేవలు
భారత్ 1983లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక మిస్సైల్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, అరుణాచలంతో కలిసి అగర్వాల్ పనిచేశారు. అగ్ని సిరీస్ క్షిపణులను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అగర్వాల్ఫాదర్ ఆఫ్ అగ్ని సిరీస్ మిస్సైల్స్ గా పేరు పొందారు. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్‌గానూ ఆయన పనిచేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లో సీనియర్ సైంటిస్ట్‌గా2005లో రిటైర్ అయ్యారు.