చేవెళ్ల, వెలుగు : అతివేగం..అజాగ్రత్తగా నడపడంతో తుఫాన్బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్–బీజాపూర్నేషనల్ హైవేపై జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్జిల్లా బషీరాబాద్మండలం దామరచెడ్కు చెందిన చెట్టుకింది రమేశ్ (35) డ్రైవర్గా పని చేస్తున్నాడు. తుపాన్ వాహనంలో శనివారం తెల్లవారుజామున మరో ఏడుగురితో కలిసి హైదరాబాద్కు బయలుదేరారు.
ఉదయం 7.30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్ చౌరస్తా సమీపంలోని మూల మలుపు వద్ద తుపాన్ అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ రమేశ్ తో పాటు బోయ లక్ష్మయ్య (65) స్పాట్ లోనే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మొయినాబాద్పోలీసులు కేసు నమోదు చేశారు.