![కుంభమేళాకు వెళ్తుండగా కారు బోల్తా](https://static.v6velugu.com/uploads/2025/02/road-accident--at-adilabad-district-in-gudihatnuur_qVMZLSXKce.jpg)
- 8 మందికి స్వల్ప గాయాలు
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘటన
గుడిహత్నూర్, వెలుగు: యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో కుంభమేళాకు వెళ్తుండగా కారు బోల్తాపడిన ఘటనలో 8 మంది గాయపడిన ఘటన ఆదిలాబాద్జిల్లా గుడిహత్నూర్ వద్ద జరిగింది. ఎస్‌ఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి కుంభమేళాకు ఇన్నోవా కారులో 8 మంది వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున గుడిహత్నూర్ వద్ద నేషనల్ హైవే పై అదుపుతప్పి మహారాష్ట్ర బ్యాంక్ ముందు సర్వీస్‌రోడ్డు పై బోల్తా పడింది. అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.