జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని లింగాల గణపురం మండలంలోని వడిచర్ల దగ్గర ఆదివారం ( అక్టోబర్ 13, 2024 ) తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండాగా మార్గమధ్యలోనే మృతి చెందారు.
మృతుడు కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కు చెందిన రవీందర్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.