జీడిమెట్ల, వెలుగు: జీహెచ్ఎంసీ టిప్పర్ ఢీ కొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డికి చెందిన బాయికాడ పండరి(43) తన కుంటుంబంతో బతుకు దెరువు కోసం వచ్చి జగద్గిరిగుట్ట శ్రీరాంనగర్‌లో నివాసముంటూ సెంట్రింగ్ మిల్లర్ వద్ద లేబర్ వర్క్ చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఒక బాబు, ఓపాప ఉన్నారు. కాగా పండరి మంగళవారం ఉదయం హెచ్ఎంటీ జంగల్లోకి వాష్‌రూమ్‌కి వెళ్లాడు. అదే సమయంలో జీహెచ్ఎంసీ టిప్పర్ డ్రైవర్ చెత్తను జంగల్లో పారబోయడానికి వెళ్లి అతన్ని చూసుకోకుండా టిప్పర్ రివర్స్ చేశాడు. దీంతో పండరి టిప్పర్ టైర్ల కిందపడి మృతిచెందాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.