- మరొకరి పరిస్థితి విషమం
కరీంనగర్ క్రైం,వెలుగు: లారీని వెనక నుంచి బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తపల్లికి చెందిన చిలుముల సాయికృష్ణ(23), వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన తాండ్ర శ్రీహాస్(21) రెస్టారెంట్‌లో పని చేస్తూ ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అలాగే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన మామిడిపల్లి నాగరాజు(23) అదే రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు. రూమ్ వైపు బైక్పై వెళ్తూ ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు.
ముగ్గురు లారీ వెనక భాగంలో ఇరుక్కున్నారు. అలాగే 100 మీటర్ల దూరం వరకు వారిని ఈడ్చుకెళ్లింది. ఆ సమయంలో సాయికష్ణ బైక్ నడుపుతుండగా శ్రీహాస్, నాగరాజు వెనక కూర్చొని ఉన్నారు. ఈ ప్రమాదంలో సాయికష్ణ అక్కడకక్కడే చనిపోగా, శ్రీహాస్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ రాజదీశ్ ప్రసాద్ మిశ్రాపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.