అయ్యో పాపం.. కూలీల ట్రాక్టర్​ బోల్తా.. మహిళా కూలి,, ఓ చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది.  పొట్టనింపుకునేందుకు పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లారు.  కొత్తూరు పోలీస్​ స్టేషన్  పరిధిలో.. తిమ్మాపూర్​ హుక్స్​ కంపెనీ దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు మహిళా కూలి మృతి చెందింది.   ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల  ప్రకారం... 

రెడ్డిపాలెంలో పత్తి తీసేందకుదు కర్నూలు నుంచి ట్రైన్​ లో శనివారం ( నవంబర్​ 30)  రాత్రి తిమ్మాపూర్​ రైల్వేస్టేషనుకు వచ్చారు.  వీరిని రెడ్డిపాలెం గ్రామానికి ట్రాక్టరులో తరలిస్తుండగా.. తిమ్మాపూర్​ హుక్స్​ కంపెనీ దగ్గర  అదుపు తప్పి ట్రాక్టర్​ బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో ఒక  మహిళా కూలి మృతి చెందగా.. మరో చిన్నారి మృతి చెందింది.  ఇంకా ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళా కూలీలు .. ఉరవకొండమ్మ,వెంకటేశ్వరమ్మ లు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : ఏపీ, తెలంగాణాలో ఫెంగల్ ఎఫెక్ట్