కారు బైక్ ఢీ.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీనివాస్ నగర్ శివారులో కారు బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు వేములపల్లి మండలం ఆమనగల్లుకు చెందిన ఎల్లమ్మ, సిద్ధు, లక్ష్మీగా గుర్తించారు. బంధువుల వివాహానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.