కూలీల ఆటో బోల్తా.. ఒకరి మృతి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రైతు కూలీల ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఇవాళ ఉదయం గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కూలీలను మేడారంలో వరి నాట్లు వేయడం కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి నార్లపూర్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బుగ్గమ్మ, మల్లమ్మ, పరిస్థితి విషమంగా ఉంది. క్షత్ర గాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.