ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

భార్య మృతి, భర్తకు సీరియస్  
నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ఘటన

మిర్యాలగూడ, వెలుగు: ట్రాక్టర్ ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా,  భర్తకు సీరియస్ గా ఉన్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని నెల్లూరుకు చెందినవారు ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ లో ఓ పెండ్లికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. 

మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దంపతులు నూనావత్ సైదా, సునీత(38) సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జటావత్ తండాకు బొడ్రాయి పండుగకు ట్రాక్టర్ పై బయలుదేరి వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున అద్దంకి- – నార్కట్ పల్లి రహదారిపై చింతపల్లి బైపాస్ వద్ద ట్రాక్టర్ ను ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో సునీత స్పాట్ లో మృతిచెందగా..  సైదా కోమాలోకి వెళ్లాడు.

 బస్సులోని నెల్లూరుకు చెందిన రాజశేఖర్, నాగ చరిత, శైలజ, రాధ, అఖిల, శివరామకృష్ణ, సురేందర్ రావుతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ టౌన్ లోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.