ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరి మృతి

గండిపేట నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన టాటా ఏస్ వాహనం డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. ముగ్గురూకి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూకుసు రావడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద అంబర్ పేట్ నుండి గచ్చిబౌలి వైపు వెళుతుండగా వాహనం ప్రమాదానికి గురైంది.