
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళుతున్న ఇనోవా వాహనం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది, దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
లారీని భలంగా ఢీ కొట్టడంతో ఇన్నోవా కారు నుజ్జు నుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్నది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.