ఏపీలో ఘోరం: ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళలు మృతి..

ఏపీలో ఘోరం: ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళలు మృతి..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 25మంది కూలీలు పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడటంతో మహిళలంతా ట్రాక్టర్ కింద పడిపోయారు.

ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళలు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 

ALSO READ | అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి