అతివేగం ప్రమాదకరం అని ఎన్ని బోర్డులు పెట్టినా జనాలు ఆగడం లేదు. ముందు వెళ్లే ఎలాగైనా ఓవర్ టేక్ చేయాల్సిందే.. అనే తపనతో ఇద్దరు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో జరిగింది. టిప్పర్ లారీని .. బైక్ ఓవర్ టేక్ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లెచెరువు వద్ద టిప్పర్ లారీ ని.. బైక్ ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తుంది. భార్య.. భర్త.. కుమారుడు.. కుమార్తె ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదంలో భార్య( రుక్సానా బేగం) .. 3 సంవత్సరాల కుమార్తె( సిఫా) అక్కడికక్కడే మరణించారు. భర్త(అజీమ్)కు.. కుమారుడి(ముజమిల్)కి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మైలార్ దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.