శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ఈద్గా పై టర్నింగ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు,స్కార్పియో వాహనం ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. శ్రీశైలం వస్తున్న స్కార్పియో వాహనంలో తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద మద్దనూరు గ్రామానికి చెందిన లక్ష్మణ్ స్వామి, అరుణ దంపతులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన స్థలం నుండి రెండు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి.