సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. జిల్లాలోని జడ్చర్ల జాతీయ రహదారి 167 పై లారీ బైకును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) సాయంత్రం చోటు చేసుకుంది ఈ ప్రమాదం. చిలుకూరు మండల మీట్స్ కళాశాల దగ్గర వెళ్తున్న బైకును ఢీకొట్టింది లారీ.ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ALSO READ | హైదరాబాద్ లో మహిళ దారుణ హత్య..
ప్రమాదంలో మరణించినవారు మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి గ్రామస్తులుగా గుర్తించారు పోలీసులు.మిర్యాలగూడ నుండి కోదాడకు వస్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.