సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. 15మందికి గాయాలు 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ టెంపో బస్సు లారీ డి కొన్న ఘటనలో 15 మంది టూరిస్టులకు గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ కి తీవ్ర గాయాలవ్వటంతో  పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను  సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బస్సులో మొత్తం 25 మంది టూరిస్టులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. టూరిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందినవారని సమాచారం. టూరిస్టులు షిరిడి నుంచి విజయనగరం పోతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.