
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది. ఏడవ మైలు సమీపంలో కారు అదుపుతప్పి పిట్ట గోడను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణంలో తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .