తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ( జనవరి 26, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఓ కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి రెయిలింగ్ ను ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది.. తిరుపతి నుండి తిరుమలకు వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
తిరుమలకు 6 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. కారు వేగంగా వెళ్లి రెయిలింగ్ ను డీకొనడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ALSO READ | ఘోర రోడ్డు ప్రమాదం...అదుపుతప్పి ఆటోలపై పడిన కంటైనర్.. ఏడుగురు మృతి