హైదరాబాద్–విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మే 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్–విజయవాడ హైవేపై చిట్యాల వద్ద ఓ కారు ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డివైడర్ కు తాకి బస్సును ఢీకొట్టింది. కారులోని ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి  గాయాలైయ్యాయి. కారు పూర్తిగా డ్యామేజ్ అవ్వగా.. బస్సు ముందు భాగం దెబ్బతింది. 

బస్సులోని ప్రయాణికులను మరో బస్సు ఏర్పాటు చేసి పంపించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇక హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.