వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో కారు ఢీకొట్టడంతో పికప్ ట్రక్కు రన్నింగ్ లో ఉన్న బైకుపై పడింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు చనిపోయారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి వైన్స్‌కు చెందిన పికప్ ట్రక్కు హైదరాబాద్ నుంచి కోటపల్లికి లిక్కర్ లోడ్‌తో బయలుదేరిందని పోలీసులు తెలిపారు.
దాన్ని ఎస్ఏపీ పీజీ కాలేజీ వద్ద కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దాంతో పికప్ ట్రక్కు రోడ్డుకు ఎడమవైపున వెళ్తున్న బైక్‌పై పడగా, బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరిని రాజీవ్ నగర్ కు చెందిన రవి(49)గా పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.