వికారాబాద్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వికారాబాద్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పరిగి వెలుగు : వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతలచెరువు సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్​ఐ  సంతోష్​ కుమార్​ వివరాల ప్రకారం.. కర్ణాటక లోని గుల్బర్గా కు చెందిన చౌహాన్ రాజు నాయక్  (30) ఆదివారం బైక్​ పై చింతల్ చెరువు దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో  రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. స్థానికులు అతని  ఫోన్ లోని నెంబర్ల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వచ్చారు. మృతుని భార్య సావిత్రమ్మ ఫిర్యాదుతో పరిగి ఎస్ ఐ సంతోష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.