ఆటో, బస్సు ఢీ.. నలుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తేజ ఫుడ్ ఇండస్ట్రీ కూలీలతో వెళ్తున్న ఆటోను, అదే సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో హాస్పిటల్ కు తరలిస్తుండగా నలుగురు మహిళలు మృతి చెందారు.  మృతులు చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో శిరీష, ధనలక్ష్మి, నాగలక్ష్మి, అనసూయ ఉన్నట్టు తెలుస్తోంది.