గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం : ఆటోను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి

గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం : ఆటోను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి

తాండూరు : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తాండూరు మండలంలోని, మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు లక్ష్మి, అనంతయ్య యాలాల జుంటుపల్లి సీతారామ స్వామి జాతరకు వెళ్లి ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్నారు. వీరు సోమవారం సాయంత్రం దైవదర్శనం చేసుకుని ఆటోలో తిరిగి ఇంటికి వస్తుండగా  మార్గమధ్యలో ..దౌలాపూర్ గ్రామం దగ్గర ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న లక్ష్మి , అనంతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న  మరో మహిళ చనిపోయింది. ఆమె ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని సమీప హస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.