అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు స్పాట్ డెడ్

బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్ డే పార్టీకి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు స్పాట్లోనే చనిపోయారు. ఒక్క ఘటన నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. చనిపోయిన నలుగురు యువకులు అనంతపురం పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నార్పలలో బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందా లేక యువకులే మద్యం సేవించి కారు నడిపారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.