
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (మార్చి 3) రాత్రి భూపాలపల్లి మండలం రాంపూర్ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు.
మృతులను భూపాలపల్లి మండలం మీనాజీ పేటకు చెందిన పింగిలి రవీందర్ రెడ్డి, లడ్డు పాంబాపూర్ గ్రామానికి చెందిన సతీష్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | డేంజర్ బెల్స్ మోగినయ్..! వరంగల్ ప్రజలు పీల్చే గాలి ఇంత దారుణంగా ఉందా..?