ఫ్రెండ్ షిప్ డే రోజే విషాదం .. ముగ్గురు స్నేహితులు మృతి

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కాలువలోకి వేగంగా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయాలతో బయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం  ఆసుపత్రికి తరలించారు స్థానికులు. 

మృతులు ఏలూరులోని రామచంద్ర  ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నట్లుగా గుర్తించారు. మారేడుమిల్లి వెళ్ళి తిరిగి వస్తుండగా..అతివేగంతో కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. 

మృతుల్లో ఒకరు గన్నవరానికి చెందిన ఉదయ్ కిరణ్  కాగా మరో ఇద్దరు హేమంత్, హర్షవర్దన్ గా లనరు ఏలూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.  ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. 

కాగా ఇదే కారుపై నల్గొండలో చలాన్లు కూడా ఉన్నాయి.  ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.