- మహా శివరాత్రి వేడుకలు ముగించుకొని వెళ్తుండగా ఘటన
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం బైరాపురం గ్రామ సమీపంలో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బైక్‌ని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతులు చెందిన శేఖర్, సాయి, రఫీ మానవపాడు మండలం కొర్విపాడు విలేజీకి చెందిన వారిగా గుర్తించారు. అలంపూరులో మహాశివరాత్రి వేడుకలను చూసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోదంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.