జనగామ జిల్లాలో లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొట్టి..షాపులోకి దూసుకెళ్లిన లారీ

జనగామ జిల్లాలో లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొట్టి..షాపులోకి దూసుకెళ్లిన లారీ

జనగామ జిల్లా పాలకుర్తిలో లారీ బీభత్సం సృష్టించింది.అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వాహనాలను, మనుషులను ఢీకొట్టుకుంటూ ఓ షాపులోకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, బైక్, షాపు ధ్వంసమయ్యాయి. గాయపడ్డవారిని అంబులెన్స్ ఆస్పత్రికి తరలించారు. 

పాలకుర్తి మండల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అదే స్పీడ్ తో టూవీలర్ ఢీకొట్టి ఓషాపులోకి దూసుకెళ్లింది. జేసీబీ సాయంతో షాపులోకి చొచ్చుకుపోయిన లారీని పోలీసులు బయటికి తీశారు. 

ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సకోసం అంబెలన్స్ లో జనగామ  ఆస్పత్రికి తరలించారు.