జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణానికి చెందిన అఫ్సర్, మొగిలిపేటకు చెందిన మరో వ్యక్తి వేర్వేరు ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్నారు. మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామ శివారులోని మెట్పల్లి మల్లాపూర్ రహదారిపైకి రాగానే ఇరువురి వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో అఫ్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొగిలిపేటకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అఫ్సర్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.