బ్రేకింగ్ న్యూస్: జమ్మూలో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి

 బ్రేకింగ్ న్యూస్:   జమ్మూలో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి

జమ్ముకాశ్మీర్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. దోడాలో బస్సు లోయలో పడిన ఘటనలో 36 మంది మరణించారు. 19 మంది గాయపడగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.    JK02CN-6555 రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.  50 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం బస్సు కిష్త్వాడ్‌ నుండి బస్సు బయలుదేరింది.  బటోట్‌ -కిష్త్వార్‌ జాతీయ రహదారిపై ట్రుంగల్‌ అస్సార్‌ సమీపంలో బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయిందని జమ్ము డివిజనల్‌ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు .

also read :- చంద్రబాబుకు గుండె జబ్బు ఉంది : కోర్టుకు తెలిపిన లాయర్లు

ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థంకాలేదు. భయంతో కేకలు వేశారు.  గాయపడిన వారిని కిష్త్వార్‌, దోడా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. గాయపడిన వారిని తరలించేందుకు హెలికాఫ్టర్‌లను ఏర్పాటు చేశారు.

బస్సులో ఉన్న 36 మంది ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఎవరైనా వచ్చి తమను కాపాడితే బాగుండని అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బంది.. స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. చాలా ఎత్తు నుంచి లోయలో పడిపోవడం వల్ల బస్సు పూర్తిగా దెబ్బతింది. మృతులకు జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు.

మరోవైపు.. జమ్ముకశ్మీర్​ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్​, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందించనున్నట్లు తెలిపారు.'జమ్ముకశ్మీర్‌లోని డోడాలో జరిగిన బస్సు ప్రమాదం నాకు బాధ కలిగించింది. బాధితుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. 'అని మోదీ ట్విట్టర్(ఎక్స్​)​లో పేర్కొన్నారు.


జమ్ముకశ్మీర్‌లోని డోడా వద్ద జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర వేదనకు గురయ్యానని కేంద్రమంత్రి అమిత్ షా ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు. ప్రమాదస్థలిలో స్థానిక యంత్రాంగం త్వరితగతిన సహాయక చర్యలు చేపడుతుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.' అని ట్వీట్ చేశారు.

'డోడా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 36 మంది చనిపోవడం విచారకరమని కేంద్రమంత్రి జితేద్రసింగ్ ట్వీట్ చేశారు. . క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా వారిని ఆదుకుంటుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు