సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ దుర్గాపురం స్టేజ్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్న పాప కూడ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు.ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.