
సూర్యపేట జిల్లా కోదాడలో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. పట్టణంలోని కోదాడ-ఖమ్మం క్రాస్‌రోడ్డు దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.