మలక్ పేటలో రోడ్డు ప్రమాదం... లారీ.. బైక్ ఢీ.. ఒకరు మృతి

మలక్ పేటలో రోడ్డు ప్రమాదం... లారీ.. బైక్ ఢీ.. ఒకరు మృతి

హైదరాబాద్  చాదర్ ఘాట్ సమీపంలోని  మలక్ పేట ..  మార్కెట్ గంజ్ వద్ద  ప్రధాన రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని.. ద్విచక్రవాహనం ( యాక్టివ)  వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చాదర్​ఘాట్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతుడు చంచల్​గూడకు చెందిన షేక్​ ఇస్మాయిల్​గా గుర్తించారు. లారీ వెనుకభాగంలో యాక్టివ బైక్​ ఇరుక్కుంది.