మేడ్చల్ జిల్లాలో దారుణం.. యువకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాల్ చౌరాస్తాలో ఓ బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 9వ తేదీ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 

మృతుడిని వంశీధర్ గా గుర్తించారు. మరో వ్యక్తి సుమన్ గాయాలపాలయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదానికి అతివేగమే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.