నల్లగొండ బైపాస్లో ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు..ఐదుగురికి తీవ్రగాయాలు

నల్లగొండ:నల్లగొండ బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడ్డ వారిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అద్దంకి-నార్కట్పల్లి హైవేపై పానగల్ దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. 

సమీపంలోని రైస్ మిల్లులో ధాన్యం అన్లోడ్ చేసి వస్తున్న ట్రాక్టర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా అద్దంకి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణి స్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.