నల్గొండ జిల్లాలో 65 వ జాతీయ రహదారిపై ఇనుపాముల గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను 108 వాహనంలో నకిరేకల్ ఏరియా హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.
అక్కడి నుంచి నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి వారిని తరలించారు. ప్రమాదం జరిగిన కారులో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి చెందిన రిజిస్ట్రార్ భట్టు రమేష్ ఉన్నారు. ఖమ్మంలో ఆయన అత్త చనిపోయారని... ఈరోజు మధ్యాహ్నం ఖమ్మంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.